గంజాయి మత్తులో యువకుల మధ్య ఘర్షణ

గంజాయి మత్తులో యువకుల మధ్య ఘర్షణ

MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద శనివారం రాత్రి గంజాయి మత్తులో యువకులు ఘర్షణకు పాల్పడ్డారు. దీంతో చెరువు కట్ట ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీస్ శాఖ గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నప్పటికీ గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించడం చర్చనీయాంశంగా మారింది.