కాపుల వనసమారాధనకి బొత్స హాజరు

కాపుల వనసమారాధనకి బొత్స హాజరు

విశాఖలోని ముడసర్లోవ పార్కులో ఆదివారం కాపు యువసేన ఆధ్వర్యంలో జరిగిన కాపు ఆత్మీయ కలయిక–వనసమారాధన కార్యక్రమంలో వేలమంది పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కులాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని, కులం పరస్పర సహకారం కోసం మాత్రమే ఉపయోగపడాలని అన్నారు. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.