కలాం విగ్రహ ఆకృతిని ఆవిష్కరించిన సీఎం

GNTR: వైబ్రంట్స్ ఆఫ్ కలాం అనే సంస్థ రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాలు ఏర్పాటు చేస్తోంది. విజయ్ కలాం నేతృత్వంలో ఈ విగ్రహాలు ఏర్పాటు అవుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఈ విగ్రహాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించేందుకు సచివాలయానికి తీసుకుచ్చారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం విగ్రహ ఆకృతిని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.