విద్యుత్ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి
ATP: రాప్తాడు రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తాగునీరు, భూ సమస్యలు, ఇళ్ల పట్టాలపై ఎక్కువ వినతులు వచ్చాయి. విద్యుత్ లైన్లు వేలాడుతున్న సమస్యపై విద్యుత్ శాఖ ఏఈ పనితీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ప్రజలను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పొద్దని అధికారులను ఆదేశించారు.