ఆదివాసీ గోండి చిత్రకళ అమోఘం

ఆదివాసీ గోండి చిత్రకళ అమోఘం

ADB: ఆదివాసీల జీవనశైలిని ప్రతిబింబించే గోండి చిత్రకళా నైపుణ్యం అమోఘమని పలువురు అధ్యాపకులు ప్రశంసించారు. ప్రముఖ కళాకారుడు మెస్రం రాము గీసిన చిత్రాలను ఉట్నూర్ కళాశాల అధ్యాపకులు కపిల్, రాకేశ్, ఆనంద్ బండారి సోమవారం సందర్శించారు. సాంప్రదాయ చిత్రాల విశిష్ఠతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు.