'ఆస్తి పన్నుపై 5% రాయితీని సద్వినియోగం చేసుకోవాలి'

'ఆస్తి పన్నుపై 5% రాయితీని సద్వినియోగం చేసుకోవాలి'

కరీంనగర్ నగరపాలక సంస్థ అందిస్తున్న 'ఎర్లీ బర్డ్' స్కీం ద్వారా 5 శాతం ఆస్తి పన్ను రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ శ్రీనివాస్ కోరారు. సోమవారం పౌర సేవా కేంద్రాన్ని సందర్శించిన ఆయన, పన్ను చెల్లింపుదారుల కోసం అదనపు కౌంటర్లు, తాగునీరు, కూలర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 2026-27 ఆర్థిక సంవత్సర పన్నును సకాలంలో చెల్లించాలన్నారు.