VIDEO: 'వన్ డే కిసాన్' కార్యక్రమం.. పొలంలో పాఠాలు

ADB: ASF జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు దేశానికి అన్నం పెట్టే రైతు పడే కష్టం విద్యార్థుల కళ్లకు కట్టినట్లు చూపించడానికి వారిని పొలానికి తీసుకెళ్ళి పాఠాలు బోధించాడు. వివరాల్లోకి వెళితే బెజ్జూర్ మండలం జ్యోతి బాపూలే పాఠశాల ఉపాధ్యాయుడు 'వన్ డే కిసాన్' కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను పొలానికి తీసుకువెళ్లారు. దున్నడం, నాట్లు వేయడం, మందుల వాడకం, రైతు కష్టం గురించి వివరించారు.