స్టాల్స్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

TPT: గూడూరు పట్టణంలోని మండల వ్యవసాయ శాఖ ఆఫీసు ప్రాంగణంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రకృతి సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటల స్టాళ్లను గూడూరు ఎమ్మెల్యే డా. పాశం సునీల్ కుమార్ సందర్శించారు. సేంద్రియ సాగుతో భూసారాన్ని కాపాడుకోవడమే కాక ప్రకృతిని సంరక్షించుకోవచ్చునని ఎమ్మెల్యే పేర్కొన్నారు.