40 రోజులుగా నిలిచిన పర్యాటకం

ASR: గోదావరి వరదల నేపథ్యంలో పాపికొండల విహారయాత్ర నిలిచిపోయి 40 రోజులైంది. వర్షాలు, వర దల కారణంగా గోదావరిలో నీటి మట్టం పెరగడంతో జులై 11 నుంచి పాపికొండల పర్యాటకాన్ని జలవనరుల శాఖ అధికారులు నిలిపివేశారు. ఆగస్టులోనూ వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో పునరుద్ధరించలేదు. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద పర్యా టక బోట్లను నిర్వాహకులు ఒడ్డుకు చేర్చారు.