ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

అన్నమయ్య: చిట్వేలిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా పూజలు జరిగాయి. శనివారం కావడంతో స్వామివారి మూలవిరాట్ మూర్తిని పలు రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి ఆకు పూజలు, సింధూర పూజలు, అభిషేకాలను నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.