కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే
KMR: పిట్లం మండల కేంద్రంతో పాటు హస్నాపూర్, తిమ్మనగర్, కొడఫ్గల్ తండా, మార్దండ గ్రామాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల కొనసాగింపు, కొత్త అభివృద్ధి కార్యక్రమాలకై కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.