నిరంతరం ప్రజా సమస్యల ప్రస్తావన: ఎమ్మెల్యే
ASR: దివంగత కొయ్యూరు జడ్పీటీసీ వారా నూకరాజు ముక్కుసూటి వ్యక్తి అని అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం అన్నారు. ఆదివారం చిట్టెంపాడు గ్రామంలో జరిగిన వారా నూకరాజు పెద్ద కర్మ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తాను కొంతకాలం జడ్పీటీసీగా నూకరాజుతో ప్రయాణం చేశానన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేశారన్నారు. జడ్పీ సమావేశాల్లో ప్రజా సమస్యలు ప్రస్తావించేవారన్నారు.