విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్త: ఏఈ
MDK: రామాయంపేట మండలంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఈ తిరుపతిరెడ్డి సూచించారు. తీగలు తెగిపడితే ముట్టుకోవద్దని, సొంతంగా మరమ్మతులు చేయరాదని హెచ్చరించారు. పశువులను స్తంభాలకు కట్టవద్దని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులకు తెలపాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాపాయం ఉంటుందని, నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.