'రహదారి నిబంధనలు పాటించాలి'
ASR: వాహనదారులు రహదారి నిబంధనలు పాటించాలని జీ.మాడుగుల ఎస్సై షణ్ముఖరావు సూచించారు. తమ సిబ్బంది, ఏపీఎస్పీ సిబ్బందితో కలిసి కొత్తూరు జంక్షన్ వద్ద బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రతీ వాహనాన్ని నిలిపి వేసి క్షుణ్ణంగా తనిఖీ చేసి విడిచి పెట్టారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.