బైక్, లారీ ఢీకొని ఇద్దరు మృతి
TPT: పెల్లకూరు వద్ద నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూల్‌డ్రింక్స్ లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బొడెద్దుల భరత్ (20) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ముని కుమారును శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించే సమయంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.