VIDEO: మున్నేరుకు కొనసాగుతున్న వరద

KMM: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద మున్నేరుకు వరద తీవ్రత కొనసాగుతుంది. అటు మున్నేరు పక్కనే పొలానికి వెళ్లే రహదారిపై వరద చేరుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. అలాగే తీర్దాల మున్నేరు చెక్ డ్యామ్ వద్ద స్థానికుల సెల్ఫీలతో సందడి నెలకొంది.