జాతీయ స్థాయి బేస్ బాల్ టోర్నమెంట్‌కు ఎంపిక
KDP: లింగాల మండలం పార్నపల్లె గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న చల్లా నాగచైతన్య జాతీయ స్థాయి బేస్ బాల్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యారని పాఠశాల హెడ్ మాస్టర్ అర్జున్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల రైల్వేకోడూరులో జరిగిన రాష్ట్రస్థాయి ప్రతిభ చూపి జాతీయస్థాయి పోటీలకు పోటీలలో ఎంపికయ్యారన్నారు.