భద్రచలానికి సీఎం.. తుమ్మల కీలక ఆదేశాలు
TG: భద్రాద్రి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శ్రీరామనవమి రోజు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.