హైదరాబాద్‌కు బ్రిటన్ స్కూల్స్

హైదరాబాద్‌కు బ్రిటన్ స్కూల్స్

తెలంగాణ విద్యా రంగంలో మరో కీలక ముందడుగు పడబోతోంది. బ్రిటన్‌కు చెందిన 13 ప్రఖ్యాత ప్రైవేట్ పాఠశాలలు హైదరాబాద్‌లో తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ మేరకు బ్రిటన్ ప్రతినిధి బృందం నేడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో భేటీ కానుంది. విద్యా ప్రమాణాలు, నియమ నిబంధనలు, ఇతర మౌలిక వసతులపై ఉన్నతాధికారులతో చర్చించనున్నిరు.