రిలయన్స్ మార్ట్‌పై కేసు నమోదు
ప్రకాశం: పొదిలిలోని రిలయన్స్ మార్ట్‌లో కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్నారని వినియోగదారుల ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్నట్లు నిర్ధారించుకొని అధికారులు కేసు నమోదు చేశారు. కాలం చెల్లిన వస్తువుల అమ్మకంపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.