పెరుగుతున్న వరద ఉద్ధృతి.. ఇంఛార్జ్ కలెక్టర్ ఆదేశాలు

కృష్ణా: ప్రకాశం బ్యారేజీ వరద ఉద్ధృతి పెరగడంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులు ఆదేశించారు. క్షేత్రస్థాయి ధికారులతో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితులను డివిజన్ వారీగా ఆమె సమీక్షించారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.