వీడిన హత్య కేసు.. నిందితుల అరెస్ట్

వీడిన హత్య కేసు.. నిందితుల అరెస్ట్

NLR: 3 రోజుల కిందట చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్టోరియా గార్డెన్ వద్ద లైక్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు.  నిందితులు నూరుద్దీన్, ఉస్మాన్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మృతుడు లైక్ మానసికంగా, ఆర్థికంగా తమను ఇబ్బంది పెట్టడంతో హత్య చేశామని నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు.