నర్సీపట్నం యువతి తూర్పుగోదావరి కలెక్టర్

నర్సీపట్నం యువతి తూర్పుగోదావరి కలెక్టర్

AKP: నర్సీపట్నానికి చెందిన యువతి చేకూరి కీర్తి తూర్పుగోదావరి కలెక్టర్ అయ్యారు. ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీర్తిని కలెక్టర్‌గా తూర్పుగోదావరికి బదిలీ చేసింది. ఈమె చెన్నైలో ఐఐటీ చేసి ఐఆర్ఎస్ రాసి మొదటగా కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసారు. తర్వాత ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఐఏఎస్ హోదాలో వివిధ జిల్లాలో పనిచేసారు.