ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
NLG: కొత్తగా ఏర్పాటు చేసిన మండలంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎంపీడీవో, పీహెచ్సీ, పోలీస్ స్టేషన్ సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి నాలుగు ఎకరాల భూమిని మంజూరు చేయించారు. మంగళవారం ఎమ్మెల్యే ఆ స్థలాన్ని పరిశీలించి, అధికారులకు తగిన సూచనలు చేశారు.