'రోడ్డు భద్రత నియమాలు పాటించాలి'
KNR: రోడ్డు భద్రత మహోత్సవాలలో కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి అంబాలాపూర్-మొలంగూర్ ఎక్స్ రోడ్డు వరకు స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు మార్కింగ్ పనులను శనివారం చేపట్టారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, అధిక వేగం తగ్గించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు తప్పక వాడాలని సూచించారు.