నేత్రపర్వంగా సీతారామచంద్రస్వామి నిత్య కళ్యాణం

నేత్రపర్వంగా సీతారామచంద్రస్వామి నిత్య కళ్యాణం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం నిత్య కళ్యాణం వైభవంగా జరిగింది. ఉదయం గోదావరి నది నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేసి, ఆరాధన పూజలు నిర్వహించారు. తర్వాత నిత్య కళ్యాణ మూర్తులను బేడా మండపానికి తీసుకువెళ్లి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన వంటి సంప్రదాయ పూజలతో కళ్యాణ తంతు ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.