'పర్యావరణం పరిరక్షణకు మొక్కలు నాటాలి'
VZM: పర్యావరణం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జనసేన నాయకులు, సర్పంచి కోట్ల రఘు కోరారు. పూసపాటిరేగ మండలం కొవ్వాడలో శుక్రవారం రోడ్డుకు ఇరువైపులా 1400 మొక్కలు నాటారు. రఘు మాట్లాడుతూ.. వాతావరణం సమతుల్యత సాధించడంతో పాటు సకాలంలో వర్షాలు కురవాలంటే విరివిగా మొక్కలు నాటాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.