VIDEO: అనపర్తిలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
E.G: తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.