శ్రీశైల మల్లన్న దర్శనానికి బయలుదేరిన మార్కెట్ కమిటీ ఛైర్మన్
WGL: కార్తీక పౌర్ణమి సందర్భంగా నర్సంపేట మండల కేంద్రం నుంచి శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలన్నారు. నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి కోసం పూజ నిర్వహిస్తానని తెలిపారు.