'అగ్ని ప్రమాదాల విషయంలో జాగ్రత్తలు అవసరం'
MNCL: అగ్ని ప్రమాదాల విషయంలో జాగ్రత్తలు అవసరమని జన్నారం మండల ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం జన్నారం మండలంలోని అక్కపెల్లి గూడా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని అన్నారు. అనంతరం సిపిఆర్ పద్ధతిపై అవగాహన కల్పించారు.