'గణపతి విగ్రహాలు తరలింపులో జాగ్రత్తలు పాటించండి'

నాగర్ కర్నూల్ మండలంలోని గణపతి విగ్రహల తరలింపులో జాగ్రత్తలు పాటించాలని ఎస్సై గోవర్ధన్ పలు సూచనలు చేశారు. రద్దీ తక్కువగా ఉండే సమయంలోనే విగ్రహాలు తరలించాలని, విగ్రహం ఎత్తును బట్టి ముందుగానే రూట్ ఎంచుకుని, నిపుణులైన డ్రైవర్లను నియమించుకుని, చిన్న వాహనాల్లో భారీ విగ్రహాలు తరలించవద్దని, విద్యుత్ వైర్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.