ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: గీసుగొండ మండలం ఏలుకుర్తి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఇళ్ళు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను శాలువాతో సన్మానించి, కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.