విద్యార్థులకు బోధన చేసిన ఎంపీడీవో

ప్రకాశం: జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల నందు ఎంపీడీవో తోట చందన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డ్స్ పరిశీలించారు. స్కూల్ యొక్క పరిస్థితుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పు యొక్క పాఠ్యాంశాన్ని విద్యార్థులకు ఎంపీడీవో బోధించారు.