RAIN ALERT: రాబోయే 3 రోజులు వర్షాలు
TG: రాష్ట్రంలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ నుంచి తమిళనాడు వరకు ద్రోణి విస్తరించడంతో రాబోయే మూడు రోజుల పాటు ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌లో ఉరుములు, ఈదురుగాలులతో పాటు వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.