తాగేందుకు బురద నీరే శరణ్యం

ASR: పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీకి చెందిన మర్రిదాటు గ్రామ గిరిజనులు బురద నీరు తాగుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. మౌలిక సదుపాయాలకు ఈ గ్రామం ఆమడ దూరంలో ఉందని విద్యార్థి సంఘం నేత బాబూజీ తెలిపారు. ఇప్పటికీ రోడ్డు, తాగునీరు సౌకర్యం కోసం గ్రామస్థులు పలుమార్లు అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఫలితం లేదని వాపోయారు.