విచారణకు హాజరవ్వాలని కసిరెడ్డికి HC ఆదేశాలు
AP: ఈ నెల 24న SIT అధికారుల ఎదుట విచారణకు హాజరవ్వాలని లిక్కర్ స్కామ్ ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది. విచారణకు రావాలంటూ SIT నోటీసులు పంపిన నేపథ్యంలో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దీనిపై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం పైవిధంగా పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.