రామచంద్రపురంలో సర్వర్ వర్ధంతి
MLG: నిరుపేదల భూ హక్కుల కోసం, పేదరిక నిర్మూలన, సమానత్వం కోసం ఉద్యమించి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి కామ్రేడ్ ఎండి. సర్వర్ అని, ఆయన ఆశయాలను కొనసాగిద్దామని MCPI(U) నేతలు పిలుపునిచ్చారు. నేడు సర్వర్ 39వ వర్ధంతి కార్యక్రమాన్ని మల్లంపల్లి మండలం రామచంద్రపురంలో నిర్వహించారు. ఆయన స్మారక స్థూపం వద్ద పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు జెండా ఎగరవేసి నివాళులర్పించారు.