నందవరంలో పర్యటించిన మంత్రి సోదరుడు
NDL: బనగానపల్లె మండలం, నందవరం గ్రామంలో మంత్రి బిసి. జనార్దన్ రెడ్డి సోదరుడు బిసి. రాజారెడ్డి ఇవాళ పర్యటించారు. బీసీ రాజారెడ్డి చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయానికి రాగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం బీసీ రాజారెడ్డి చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బీసీ రాజారెడ్డికి తీర్థప్రసాదాలను అందజేశారు.