కొత్తగా నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు
ATP: గుంతకల్ ఏరియా ఆసుపత్రి, కదిరి ఏరియా ఆసుపత్రిలో త్వరలో కొత్తగా ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.60 లక్షలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. వీటి ద్వారా అదనంగా 80 పడకలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.