'ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు జరిగితే హైడ్రా ఊరుకోదు'

'ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు జరిగితే హైడ్రా ఊరుకోదు'

RR: ప్రైవేట్ భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్లమని హైడ్రా మరోసారి స్పష్టం చేసింది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు జరిగితే ఊరుకోదని తేల్చి చెప్పింది. తుక్కుగూడ మున్సిపాలిటీలోని వర్టిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థకు, చైతన్య రెడ్డి అనే మహిళకు మధ్య ఉన్న వివాదం పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని పేర్కొంది. ఇద్దరి మధ్య ఉన్న భూ తగాదాలు హైడ్రా తలదూర్చదని స్పష్టం చేసింది.