శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

TPT: టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం 4.30లకు అలిపిరి పాదాల మండపం వద్ద గోవింద నామ స్మరణల నడుమ మెట్లపూజ చేపట్టారు. అనంతరం వేల సంఖ్యలో భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని అధిరోహించారు.