యువకుల మధ్య ఘర్షణ ఒకరికి తీవ్ర గాయాలు

యువకుల మధ్య ఘర్షణ ఒకరికి తీవ్ర గాయాలు

NLR: నెల్లూరులోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి యువకుల మధ్య జరిగిన ఘర్షణలో పల్లిపాటి శివాజీ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల జిల్లాలో చిన్నపాటి మనస్పర్ధలతో హత్యలు, దాడులు వంటి ఘటనలు పెరుగుతుండటం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది.