వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఎలక్షన్ పాసులు ఇవ్వాలి

సూర్యాపేట: రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వర్కింగ్‌లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఎలక్షన్ పాసులు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు యాదగిరి కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ వెంకట్రావుకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. చిన్న మీడియా పెద్ద మీడియా అని తేడా లేకుండా చూడాలన్నారు.