డాక్టర్ నందిని సిధారెడ్డికి రేవంత్ శుభాభినందనలు
TG: రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిన కవి నందిని సిధారెడ్డి రాసిన “అనిమేష” కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు.