ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

కరీంనగర్: చిగురుమామిడి మండల ప్రెస్‌క్లబ్‌ నూతన కార్యవర్గాన్ని మండల కేంద్రంలోని డార్విన్ పాఠశాలలో బుధవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా చిట్టంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా రాకం కరుణాకర్, కోశాధికారిగా తాళ్ల నరేష్, గౌరవ అధ్యక్షులుగా బుర్ర పర్శరాములు, కొంకట బాలయ్య, ఉపాధ్యక్షులుగా ఎనగందుల రవీందర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.