అప్పర్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీ ట్రాఫిక్
HYD: నగరంలో పీక్ అవర్స్ కారణంగా ట్రాఫిక్ రద్దీ పెరిగింది. లేపాక్షి ట్యాంక్ బండ్ నుంచి లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వైపు వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. ట్రాఫిక్‌లో వాహనాలు బారులు తీరాయి. రద్దీ కారణంగా ప్రయాణం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని వారు సూచించారు.