పాలిటెక్నిక్ ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్

BDK: కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 11న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ బండి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. పాలీసెట్ 2025లో ఉత్తీర్ణులైన వారు, పాలీసెట్ రాయని వారు పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జత చేయాలన్నారు.