తల్లి, కుమారుడు దారుణ హత్య

కృష్ణా: మండవల్లి మండలం గన్నవరం గ్రామంలో అర్ధరాత్రి తల్లి-కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు రొయ్యూరు భ్రమరాంబ(60), సురేశ్(21)ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఒంటరిగా నివసిస్తున్న ఇంట్లో వీరు హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. ఆస్తి కోసమే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.