దురుసుగా ప్రవర్తించిన వ్యక్తులపై కేసు నమోదు
MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని గోపాలగిరి రోడ్డులో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల తాళాలు పగలగొట్టి ఇండ్లలోకి కొంతమంది చొరబడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారని, స్థానిక తహసీల్దార్ గడీల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత వ్యక్తులపై నాన్ బేలబుల్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.