తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తల ధర్నా

ATP: అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా CITU ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా CITU నాయకులు సాకే రమేష్ మాట్లాడుతూ.. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలన్నారు.